భూసర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఏ రాష్ట్రం ఎంఓయూ చేసుకుంది?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష’ పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వేకి సర్వే ఆఫ్ ఇండియా సంపూర్ణ సహాయ సహకారాలు అందించనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో డిసెంబర్ 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సర్వే కార్యక్రమానికి 2020, డిసెంబర్ 21న శ్రీకారం చుట్టనున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష’ పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వే కార్యక్రమంలో సహాయ సహకారాల కోసం
Published date : 10 Dec 2020 07:11PM