Skip to main content

భద్రతా దళాలకు బీసీసీఐ 20 కోట్లు విరాళం

దేశ రక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెట్టే భద్రతా దళాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మార్చి 23న రూ. 20 కోట్ల విరాళాన్ని అందజేసింది.
ఇటీవల పుల్వామాలో ఉగ్రదాడికి 40 మంది భారత సీఆర్‌పీఎఫ్ జవాన్లు బలయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో బీసీసీఐ, లీగ్ పాలక మండలి 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకల్ని రద్దు చేసింది. ఆ వేడుకలకు వెచ్చించే మొత్తానికి మరికొంత జతచేసి సాయుధ బలగాలకు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆర్మీకి రూ. 11 కోట్లు, సీఆర్‌పీఎఫ్‌కు రూ. 7 కోట్లు, నావిక దళం, వాయు సేనలకు రూ. కోటి చొప్పున అందజేసింది.

సీఎస్‌కే తరఫున రూ. 2 కోట్లు...
భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పుల్వామాలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు అందజేశారు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్‌‌స (సీఎస్‌కే) కూడా అలాంటి పనే చేసింది. తమ సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన రూ. 2 కోట్లను జవాన్ల కుటుంబాలకు అందజేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భద్రతా దళాలకు 20 కోట్లు విరాళం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : బీసీసీఐ
Published date : 25 Mar 2019 05:30PM

Photo Stories