భారత్‌లో యూఏఈ కోర్టుల తీర్పుల అమలు
Sakshi Education
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫెడరల్, లోకల్ కోర్టులు జారీ చేసే డిక్రీలు, జడ్జిమెంట్ల ఉత్తర్వుల అమలుకు భారత ప్రభుత్వం అంగీకరించింది.
ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ ఫిబ్రవరి 21న వెల్లడించింది. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్-1908లోని 44ఎ కింద దఖలు పడిన అధికారాలను అనుసరించి యూఏఈని రెసిప్రొకేటింగ్ టెరిటరీగా (పరస్పర సహకార పూర్వక భూభాగం)గా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. యూఏఈ పరిధిలోని రెండు ఫెడరల్ కోర్టులు, అయిదు లోకల్ కోర్టులను ఆ ప్రాంత ఉన్నత న్యాయ స్థానాలుగా గుర్తించింది. అవి జారీ చేసే డిక్రీలు, జడ్జిమెంట్లను దేశంలో అమలు చేయనుంది. ఏదైనా డబ్బు చెల్లింపు, పన్ను బకాయిలు, జరిమానాలు, డబ్బుతో ముడిపడిన ఇతర అంశాలకు సంబంధించిన డిక్రీ, తీర్పులు ఇందులో ఉంటాయి.
భారత ప్రభుత్వం అంగీకరించిన కోర్టుల జాబితా
ఫెడరల్ కోర్టులు:
1. ఫెడరల్ సుప్రీం కోర్టు
2. ఫెడరల్, ఫస్ట్ ఇన్‌స్టెన్స్ అండ్ అప్పీల్ కోర్‌ట్స ఇన్ ద ఎమిరేట్స్ ఆఫ్ అబుధాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వాయిన్ అండ్ ఫుజైరా
లోకల్ కోర్టులు:
1. అబుధాబీ జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్
2. దుబాయి కోర్టులు
3. రస్ అల్ ఖైమా జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్
4. కోర్‌ట్స ఆఫ్ అబుధాబీ గ్లోబల్ మార్కెట్స్
5. కోర్‌ట్స ఆఫ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్

Published date : 22 Feb 2020 05:48PM