భారత్‌లో ఏకే-47 తయారీకి కేంద్రం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
Sakshi Education
భారత్‌లో ఏకే- 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
రష్యా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ చర్చలు
రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 3న వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎందుకు : భారత్‌లో ఏకే- 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటనలో ఈ ఒప్పందం కుదిరిందని సెప్టెంబర్ 2న రష్యా మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి భారత్, రష్యా సంయుక్తంగా ‘ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ జాయింట్ వెంచర్(జేవీ)లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(భారత సంస్థ), కల్నోషికోవ్ కన్సెర్న్(రష్యా సంస్థ), రోసోబోరోనెక్స్‌పోర్ట్(రష్యా సంస్థ)లు భాగస్వాములుగా ఉంటాయి. జేవీలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 50.5 శాతం వాటా, కన్సెర్న్‌కు 42 శాతం వాటా, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌కు 7.5 శాతం వాటా ఉంది.
ఒప్పందం విశేషాలు...
ఒప్పందం విశేషాలు...
- ఏకే- 47 రైఫిల్స్‌లో 203 మోడల్ ఆధునికమైన వెర్షన్.
- ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే- 47లను ఉత్పత్తి చేయనున్నారు.
- ప్రస్తుతం భారత ఆర్మీ వాడుతున్న ఇన్‌సాస్ 5.56 x45 ఎంఎం అసాల్ట్ రైఫిల్ స్థానంలో ఈ ఏకే- 47 -203 7.62×39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు.
- భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే- 47 203లు అవసరం పడతాయని అంచనా.
- లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది.
- ఒక్కోరైఫిల్ ఖరీదు దాదాపు 1100 యూఎస్ డాలర్లు.
- ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు.
- ఇన్సాస్ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆర్మీకి ఏకే- 47 203 మోడల్ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు.
రష్యా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ చర్చలు
రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 3న వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎందుకు : భారత్‌లో ఏకే- 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి
Published date : 04 Sep 2020 05:25PM