భారత్‌కు ప్రపంచ దేశాలమద్దతు
ఈ నేపథ్యంలో భారత్ కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అత్యవసర వైద్య పరికరాలను, సామగ్రిని అందజేయడంతోపాటు భారత్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తామని అమెరికా, యూకే, యూరోపియన్ యూనియన్, శ్రీలంక, ఆస్ట్రేలియా హామీ ఇచ్చాయి. భారత్ కరోనావిపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అత్యవసరంగా ఆక్సిజన్, మందులు అందిస్తామని యూరోపియన్ యూనియన్ (27 సభ్య దేశాలున్నాయి) ప్రకటించింది. వేల సంఖ్యలో పోర్టబుల్ ఆక్సిజన్ మిషన్లతోపాటు అత్యవసరమైన సామగ్రిని, 2 వేల మంది సిబ్బందిని భారత్ కు పంపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. భారత్‌కు అండగా నిలుస్తామని గూగుల్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ సంస్థల సీఈవోలు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, పునీత్ రంజన్ ప్రకటించారు. గూగుల్ సంస్థతోపాటు, ఉద్యోగులు కలిపి రూ.135 కోట్ల మేరకు నిధులను యునిసెఫ్‌కు చెందిన గివ్ ఇండియాకు అందజేస్తున్నామని సుందర్ పిచాయ్ తెలిపారు.