భారతీయ రైల్వే పనితీరు అధ్వానం : కాగ్
Sakshi Education
రైల్వే శాఖ పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుబట్టింది. 2017-18 సంవత్సరంలో రైల్వేల నిర్వహణ నిష్పత్తి 98.44 శాతం ఉందని కాగ్ పేర్కొంది. అంటే రూ.100 రాబట్టుకునేందుకు రూ.98.44 రెల్వే ఖర్చు పెట్టిందని వెల్లడించింది.
గత పదేళ్లలో ఎన్నడూ పరిస్థితి ఇంత అధ్వానంగా లేదని కాగ్ తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను డిసెంబర్ 2న పార్లమెంట్‌కు కాగ్ అందజేసింది. 2017-18 సంవత్సరంలో రూ.1,665.61కోట్ల లాభంలో ఉండాల్సిన రైల్వేశాఖ రూ.5,676.29కోట్ల నష్టాల్లో ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఖర్చు, ఆదాయం మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉందనేది ఈ నిర్వహణ నిష్పత్తి( ఆపరేటింగ్ రేషియో) ద్వారా తెలుస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతీయ రైల్వే పనితీరు అధ్వానం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)
ఎందుకు : 2017-18 సంవత్సరంలో రైల్వేల నిర్వహణ నిష్పత్తి 98.44 శాతం ఉందని
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతీయ రైల్వే పనితీరు అధ్వానం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)
ఎందుకు : 2017-18 సంవత్సరంలో రైల్వేల నిర్వహణ నిష్పత్తి 98.44 శాతం ఉందని
Published date : 03 Dec 2019 06:11PM