Skip to main content

భారత్ వృద్ధి రేటు 4.6 శాతానికి కుదింపు: ఫిచ్

2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్ 5.6 నుంచి 4.6 శాతానికి తగ్గించింది.
Current Affairsబ్యాంకింగ్ రుణ వృద్ధి మందగమనం, పుంజుకోని పారిశ్రామిక, వ్యాపార రంగాలు, వినియోగ విశ్వాసం దెబ్బతినడం వంటి కారణాల వల్ల వృద్ధి అంచనాలను కుదించినట్లు ఫిచ్ పేర్కొంది. ఈ మేరకు డిసెంబర్ 20న ఒక నివేదికను విడుదల చేసింది. ఆర్‌బీఐ (5 శాతం), మూడీస్ (4.9 శాతం), ఏడీబీ (5.1శాతం) కన్నా తాజాగా ఫిచ్ అంచనాలు తక్కువగా ఉన్నాయి.

ఫిచ్ నివేదికలోని ముఖ్యాంశాలు
  • భారత్ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’గానే కొనసాగిస్తున్నాం.
  • 2020-21లో భారత జీడీపీ రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. 2021-22లో వృద్ధి రేటు మరింత పెరిగి 6.5 శాతానికి చేరే వీలుంది.
  • ఆర్‌బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన చర్యలు, పన్నురేటు తగ్గించడంసహా కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధిరేటు పురోగతికి దోహదపడే వీలుంది.
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ఉండాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యమయినా, ఇది కొంత అదుపు తప్పే అవకాశం ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు 4.6 శాతానికి కుదింపు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్
Published date : 21 Dec 2019 05:55PM

Photo Stories