భారత్ వృద్ధి 7.5 శాతం :ప్రపంచ బ్యాంక్
Sakshi Education
2019-20 ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.
దీంతో 2019-20 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించినట్టయింది. భారత్‌లో పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వృద్ధి రేటుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు జూన్ 5న విడుదల చేసింది.
2018-19 ఆర్థిక సంవత్సరానికి భారత దేశ జీడీపీ రేటు 6.8 శాతంగా ఉంటుందన్న అంచనాను కేంద్ర గణాంక శాఖ ఇటీవల పేర్కొనగా, ప్రపంచ బ్యాంకు మాత్రం 7.2 శాతంగా ఉంటుందని తెలిపింది. చైనా 2018లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, 2019లో 6.2 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఇక 2020లో 6.1 శాతం, 2021లో 6 శాతంగా ఉంటాయని వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత జీడీపీ వృద్ధి 7.5 శాతం
ఎప్పుడు : 2019-20 ఆర్థిక సంవత్సరం
ఎవరు : ప్రపంచ బ్యాంక్

Published date : 06 Jun 2019 05:46PM