Skip to main content

భారత వాయుసేనలోకి మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు

భారత వాయుసేన(ఐఎఎఫ్) అమ్ములపొదిలోకి మరో మూడు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి.
Current Affairsఫ్రాన్స్ నుంచి బయలుదేరి నేరుగా గుజరాత్‌లోని జామ్‌నగర్ వైమానిక స్థావరంలో నవంబర్ 4న దిగాయి. ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించింది. 2020, ఏడాది జులై 29న మొదటి విడతగా 5 రఫేల్ యుద్ధవిమానాలు భారత్‌కు వచ్చాయి. ప్రస్తుతం వచ్చిన 3 రఫెల్ జెట్‌లతో కలిపి ఇప్పటికి మొత్తం 8 రఫేల్ యుద్ధవిమానాలు భారత్‌కు అందాయి. 2016లో భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.

సందర్భం:
రఫేల్ ప్రత్యేకతలు, ఒప్పందం-వివరాలు, రఫేల్ తయారీ సంస్థ పేరు

భారత్‌కు తొలి విడతలో వచ్చిన రఫేల్ విమానాలను ఏ వైమానికి స్థావరంలో, ఎప్పుడు ప్రవేశపెట్టారు?
Published date : 05 Nov 2020 05:52PM

Photo Stories