Skip to main content

భారత మాజీ క్రికెటర్‌ చేతన్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా వ్యవహరిస్తున్న చేతన్ చౌహాన్(73) కరోనా వైరస్‌తో గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆగస్టు 16న కన్నుమూశారు.
Current Affairs
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన చేతన్ 1969 నుంచి 1981 మధ్య కాలంలో భారత టెస్టు, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 40 టెస్టులు ఆడిన ఆయన 16 అర్ధ సెంచరీల సహాయంతో 2,084 పరుగులు చేశారు. ఏడు వన్డేల్లో బరిలోకి దిగి 153 పరుగులు సాధించారు.

గావస్కర్‌కు జతగా...
దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌కు జతగా 1973 నుంచి 1981 మధ్యకాలంలో చేతన్ ఓపెనర్‌గా వచ్చారు. వీరిద్దరు 59 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌కు దిగి 3,010 పరుగులు జోడించారు. క్రికెట్‌ నుంచి రిటైరయ్యాక రాజకీయాల్లోకి ప్రవేశించిన చేతన్ రెండుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతేడాది వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం సైనిక సంక్షేమం, హోంగార్డు, సివిల్‌ సెక్యూరిటీ శాఖా మంత్రిగా ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : చేతన్ చౌహాన్(73)
ఎక్కడ :గుర్‌గ్రామ్‌, హరియాణ
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా
Published date : 17 Aug 2020 05:41PM

Photo Stories