భారత క్రీడాకారిణి సనమచ చాను ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
Sakshi Education
ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత బాక్సర్లు తమ విశ్వరూపం ప్రదర్శించారు.
బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు విసిరిన పంచ్‌లకు పసిడి పతకాలు వచ్చాయి. పోలాండ్‌లోని కీల్స్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఫైనల్స్‌లో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు గీతిక (48 కేజీలు), బేబీరోజీసనా చాను (51 కేజీలు), పూనమ్ (57 కేజీలు), వింకా (60 కేజీలు), అరుంధతి (69 కేజీలు), థోక్‌చోమ్ సనమచ చాను (75 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 81 కేజీలు) స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. 2017 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అత్యధికంగా ఐదు స్వర్ణ పతకాలు లభించాయి.
Published date : 23 Apr 2021 06:21PM