Skip to main content

భారత క్రీడాకారిణి దివ్య కక్రాన్‌ ఏ క్రీడలో ప్రావీణ్యురాలు?

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు.
Current Affairs
కజకిస్తాన్‌లోని అల్మాటీలో ఏప్రిల్‌ 16న జరిగిన ఐదు వెయిట్‌ కేటగిరీల్లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), దివ్య కక్రాన్‌ (72 కేజీలు) పసిడి పతకాలు దక్కించుకోగా... సాక్షి మలిక్‌ (65 కేజీలు) రజతం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వినేశ్, అన్షు తొలిసారి ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచారు.

గతంలో ఎనిమిదిసార్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్న వినేశ్‌ నాలుగుసార్లు కాంస్యం (2020, 2019, 2016, 2013), మూడుసార్లు రజతం (2018, 2017, 2015) కైవసం చేసుకోగా... ఒకసారి (2104) ఐదో స్థానంలో నిలిచింది.
Published date : 19 Apr 2021 11:42AM

Photo Stories