Skip to main content

బ్యాంకుల విలీన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం

ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మార్చి 4న ఆమోదముద్ర వేసింది.
Current Affairsబ్యాంకుల విలీన నిర్ణయం 2020, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు.. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను మరింతగా పోటీపడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. తాజా విలీనంతో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న స్థాయి బ్యాంకులు మిగలనున్నాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

కన్సాలిడేషన్ ప్రణాళిక ప్రకారం ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నారు. అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్.. యునెటైడ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో కలపనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బ్యాంకుల విలీన ప్రతిపాదనకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసేందుకు
Published date : 05 Mar 2020 06:17PM

Photo Stories