బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా సాంటోసో
Sakshi Education
భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన అగుస్ డ్వి సాంటోసోను ఎంపిక చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28న నిర్ణయం తీసుకుంది.
సాంటోసో టోక్యో ఒలింపిక్స్ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించనున్నాడు. అతడి పర్యవేక్షణలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు ఇతర సింగిల్స్ షట్లర్లు కూడా టోక్యో కోసం సిద్ధమవుతారు.ఒలింపిక్స్ వరకు సొంటోసోకు నెలకు 8 వేల డాలర్లు (సుమారు రూ.5.8 లక్షలు ) చెల్లించనున్నారు. భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా ఉన్న కిమ్ జి హ్యూన్(దక్షిణ కొరియా) 2019, సెప్టెంబర్ 24న తన పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : అగుస్ డ్వి సాంటోసో
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : అగుస్ డ్వి సాంటోసో
Published date : 29 Feb 2020 05:47PM