బ్రహ్మకుమారీస్ చీఫ్ దాది హృదయ్ మోహిని ఇక లేరు
Sakshi Education
ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు రాజయోగిని దాది హృదయ్ మోహిని(93) కన్నుమూశారు.
అనారోగ్యం కారణంగా మార్చి 11న ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బ్రహ్మకుమారీస్ మాజీ చీఫ్ దాది జానకి ఏడాది క్రితం మరణించిన తరువాత హృదయ్ దాది మోహినిని చీఫ్‌గా నియమించారు. రాజయోగినిగా తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసిన మోహిని ఉన్నత విలువల కోసం ఎంతో కృషి చేశారు. మానసిక నిగ్రహం, మానసిక శాంతి, స్థిరత్వం, ధ్యానం లాంటి గుణాల్లో ఆమె సాధించిన విజయం ఆమెను గొప్ప యోగినిగా నిలబెట్టాయి. అనేక దేశాల ఆహ్వానం మేరకు దాది మోహిని తూర్పునుంచి పశ్చిమం వరకు ఎన్నో దేశాలను సందర్శించి, ఉపన్యాసాలు ఇచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు కన్నుమూత
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : రాజయోగిని దాది హృదయ్ మోహిని(93)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు కన్నుమూత
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : రాజయోగిని దాది హృదయ్ మోహిని(93)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 13 Mar 2021 06:21PM