బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ !
Sakshi Education
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దాదాపు ఖాయమైంది.
అధ్యక్ష స్థానానికి ‘దాదా’ ఒక్కడే నామినేషన్ వేయడంతో అక్టోబర్ 23న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో 47 ఏళ్ల సౌరవ్ ఎన్నిక లాంఛనమే కానుంది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు.. ‘పదవుల మధ్య తప్పనిసరి విరామం’ నిబంధన ప్రకారం గంగూలీ పట్టుమని పది నెలలైనా అధ్యక్ష పదవిలో ఉండడు. రాష్ట్ర, జాతీయ క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్లు పదవిలో ఉన్న వారు తప్పని సరిగా మూడేళ్లు క్రికెట్ కార్యకలాపాల నుంచి విరామం తీసుకోవాలి. బెంగాల్ క్రికెట్ సంఘంలో ఐదేళ్లుగా పదవులు అనుభవించిన గంగూలీ వచ్చే జూలై వరకే బోర్డు అధ్యక్షుడిగా ఉంటాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎంపిక లాంఛనమే
ఎవరు: భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
ఎప్పుడు: అక్టోబర్ 23న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో
క్విక్ రివ్యూ:
ఏమిటి: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎంపిక లాంఛనమే
ఎవరు: భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
ఎప్పుడు: అక్టోబర్ 23న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో
Published date : 16 Oct 2019 05:22PM