బిహార్ ఘటనలపై ప్రభుత్వాలకు నోటీసులు
Sakshi Education
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వంతోపాటు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం జూన్ 24న ఆదేశాలు జారీ చేసింది. బిహార్‌లో చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బిహార్ ఘటనలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై
క్విక్ రివ్యూ :
ఏమిటి : బిహార్ ఘటనలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై
Published date : 25 Jun 2019 05:50PM