Skip to main content

ఆ బెయిల్‌కి ‘పరిమితి’ ఉండదు

న్యూఢిల్లీ: ఏ కేసులోనైనా నిందితులకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.
Edu newsముందస్తు బెయిల్ మంజూరు చేసిన సమయంలో నిర్దిష్ట కాల వ్యవధి వంటి షరతులేవీ ఉండవని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో కోర్టులకు ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని వెల్లడించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం జనవరి 29వ తేదీన ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ పొందిన నిందితుడు/నిందితురాలు కోర్టు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినా, సదరు వ్యక్తిపై అభియోగాలు నమోదైనప్పటికీ సాధారణ పరిస్థితుల్లో కేసు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ కొనసాగుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
 
 క్విక్ రివ్యూ:
 ఏమిటి: ఏ కేసులోనైనా నిందితులకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.
 ఎప్పుడు: జనవరి 29, 2020
 ఎందుకు
:  వ్యక్తిపై అభియోగాలు నమోదైనప్పటికీ సాధారణ పరిస్థితుల్లో కేసు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ కొనసాగుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
Published date : 30 Jan 2020 05:38PM

Photo Stories