బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ విజేతగా హామిల్టన్
Sakshi Education
బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
బెల్జియంలోని స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్‌లో ఆగస్టు 30న జరిగిన రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 44 ల్యాప్‌లను గంటా 24 నిమిషాల 08.761 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 89వ టైటిల్ కావడం విశేషం. మరో రెండు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. రేసులో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు విజేత
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్, బెల్జియం
క్విక్ రివ్యూ :
ఏమిటి : బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు విజేత
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్, బెల్జియం
Published date : 31 Aug 2020 05:43PM