Skip to main content

బడ్జెట్‌కు పాక్ ఆర్మీ స్వచ్ఛంద కోత

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు మద్దతిస్తూ ఆ దేశ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.
రాబోయే ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌కు కేటాయించే నిధులను స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు జూన్ 5న తెలిపింది. బడ్జెట్‌లో కోత వల్ల కలిగే ఇబ్బందులను త్రివిధ దళాలు తగిన అంతర్గత చర్యల ద్వారా సర్దుబాటు చేసుకుంటాయని ఆ దేశ అధికారులు వివరించారు. పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు.
Published date : 06 Jun 2019 05:42PM

Photo Stories