బార్సిలోనా జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్?
Sakshi Education
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో ఘనత సాధించాడు. 121 ఏళ్ల చరిత్ర కలిగిన విఖ్యాత క్లబ్ బార్సిలోనా జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా అవతరించాడు. 767 మ్యాచ్‌లతో జావీ హెర్నాండెజ్ పేరిట ఉన్న రికార్డును 768వ మ్యాచ్‌తో మెస్సీ బద్దలు కొట్టాడు. ల లీగాలో భాగంగా రియల్ సోసిడాడ్ క్లబ్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లో మెస్సీ బరిలోకి దిగి రెండు గోల్స్ కూడా చేశాడు. ఒకే క్లబ్ తరఫున ఆడుతూ అత్యధిక గోల్స్ (బార్సిలోనా–467 గోల్స్) చేసిన రికార్డు కూడా మెస్సీ పేరిటే ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బార్సిలోనా జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్?
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : లియోనల్ మెస్సీ
Published date : 24 Mar 2021 04:41PM