అవిశ్వాస పరీక్షలో సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ విజయం
Sakshi Education
హరియాణా శాసనసభలో మార్చి 10న జరిగిన అవిశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ–జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ప్రభుత్వం సునాయాసంగా నెగ్గింది.
ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 55 మంది, అనుకూలంగా 32 మంది సభ్యులు ఓటు వేసినట్లు స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా ప్రకటించారు. హరియాణా అసెంబ్లీలో స్పీకర్‌తో కలిపి బీజేపీకి 40 మంది సభ్యుల బలం ఉంది.
హరియాణా...
అవతరణ: నవంబర్ 1, 1966. పంజాబ్‌లో కొంత భాగాన్ని హర్యానా రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
రాజధాని: చండీగఢ్
అసెంబ్లీ సీట్లు: 90
లోక్‌సభ స్థానాలు: 10
రాజ్యసభ స్థానాలు: 5
హైకోర్టు: పంజాబ్ అండ్ హరియాణ హైకోర్టు(చండీగఢ్‌లో ఉంది)
ప్రస్తుత గవర్నర్: సత్యదేవ్ నారయణ్ ఆర్య
ప్రస్తుత ముఖ్యమంత్రి: మనోహర్‌లాల్ ఖట్టర్
హరియాణా...
అవతరణ: నవంబర్ 1, 1966. పంజాబ్‌లో కొంత భాగాన్ని హర్యానా రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
రాజధాని: చండీగఢ్
అసెంబ్లీ సీట్లు: 90
లోక్‌సభ స్థానాలు: 10
రాజ్యసభ స్థానాలు: 5
హైకోర్టు: పంజాబ్ అండ్ హరియాణ హైకోర్టు(చండీగఢ్‌లో ఉంది)
ప్రస్తుత గవర్నర్: సత్యదేవ్ నారయణ్ ఆర్య
ప్రస్తుత ముఖ్యమంత్రి: మనోహర్‌లాల్ ఖట్టర్
Published date : 11 Mar 2021 05:33PM