అత్యుతమ ఆలోచనాపరుల జాబితాలో ముకేశ్
Sakshi Education
100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితా-2019లో భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చోటు లభించింది.
ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ జనవరి 16న ప్రకటించిన ఈ జాబితాలో ముకేశ్‌తోపాటు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ ఉన్నారు. అత్యుతమ ఆలోచనాపరుల జాబితాను మొత్తం 10 విభాగాలుగా విభజించగా ముకేశ్ టాప్-10 టెక్నాలజీ థింకర్స్‌లో నిలిచారు. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్‌కు కూడా స్థానం దక్కింది. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్ పాలసీ పూర్తి జాబితాను జనవరి 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల జాబితాలో ముకేశ్ అంబానీ
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల జాబితాలో ముకేశ్ అంబానీ
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్
Published date : 17 Jan 2019 05:45PM