అత్యధిక ఎఫ్1 రేసులు గెలిచిన డ్రైవర్‌గా షుమాకర్ రికార్డును సమం చేసిన ఆటగాడు?
Sakshi Education
జర్మనీ ఐఫెల్ గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు.
జర్మనీలోని నుర్‌బర్‌గ్రింగ్‌లో అక్టోబర్ 11న జరిగిన ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన 35 ఏళ్ల హామిల్టన్ నిర్ణీత 60 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 35 నిమిషాల 49.641 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.ఈ విజయంతో ఎఫ్1లో అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్‌గా 2006 నుంచి మైకేల్ షుమాకర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేశాడు. షుమాకర్ కెరీర్‌లో 306 రేసుల్లో పాల్గొని 91 విజయాలు అందుకోగా... హామిల్టన్ 261 రేసుల్లోనే ఈ ఘనతను సాధించాడు.
అత్యధిక రేసుల్లో పాల్గొన్న డ్రైవర్...
తాజా రేసులో హామిల్టన్ తర్వాత వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు ఈ రేసులో బరిలోకి దిగడం ద్వారా ప్రపంచ మాజీ చాంపియన్ కిమీ రైకోనెన్ (ఆల్ఫా రోమియో) అత్యధికంగా 323 ఎఫ్1 రేసుల్లో పాల్గొన్న డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పాడు. 322 రేసులతో బారికెల్లో (బ్రెజిల్) పేరిట ఉన్న రికార్డును రైకోనెన్ బద్దలు కొట్టాడు. సీజన్‌లోని తదుపరి రేసు పోర్చుగల్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 25న జరగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక ఎఫ్1 రేసులు గెలిచిన డ్రైవర్‌గా షుమాకర్ రికార్డును సమం
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : నుర్‌బర్‌గ్రింగ్, జర్మనీ

Published date : 12 Oct 2020 06:30PM