ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత కెనిన్
Sakshi Education
అమెరికా యువతార సోఫియా కెనిన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 1న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 4-6, 6-2, 6-2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. దీంతో కెనిన్ తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నట్లయింది. విజేత కెనిన్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ ముగురుజాకు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తాజా విజయంతో సెరెనా (2002లో) తర్వాత పిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా క్రీడాకారిణిగా కెనిన్ గుర్తింపు పొందింది. 2008 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కూడా కెనిన్ ఘనత వహించింది. 2008లో షరపోవా 20 ఏళ్ల ప్రాయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్
ఎప్పుడు : ఫిబ్రవరి 1
ఎవరు : సోఫియా కెనిన్
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా

Published date : 04 Feb 2020 05:08PM