Skip to main content

అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గగనతలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.
ఒడిశాలోని బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతంలో సెప్టెంబర్ 17న అస్త్ర క్షిపణిని భారత వైమానిక దళం పరీక్షించింది. సుఖోయ్-30 ఎంకేఐ ద్వారా అస్త్రను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అస్త్ర సమర్థంగా, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని రక్షణ శాఖ ప్రకటించింది.

అస్త్ర క్షిపణి ప్రత్యేకతలు
  • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), మరో 50 ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలతో కలిసి అస్త్ర క్షిపణిని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.
  • గాల్లో నుంచి గాల్లోకి 70 కి.మీ. పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఈ పరిధిని 300 కి.మీ.లకు పెంచడానికి డీఆర్‌డీఓ ప్రణాళికలు రూపొందిస్తోంది.
  • నిర్దేశిత లక్ష్యానికి చేరుకోవడానికి ఈ క్షిపణి గంటకి 5,555 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది.
  • 15 కిలోగ్రాముల పేలుడు పదార్థాలతో ప్రత్యేకమైన వార్‌హెడ్ ఉంటుంది.
క్విక్ రివ్యూ :
 ఏమిటి :
అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతం
 ఎప్పుడు  : సెప్టెంబర్ 17
 ఎవరు  : భారత రక్షణ శాఖ
 ఎక్కడ  : బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతం, ఒడిశా
Published date : 18 Sep 2019 06:28PM

Photo Stories