Skip to main content

అస్సాం మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్(84) కన్నుమూశారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసీహెచ్)లో నవంబర్ 23న తుదిశ్వాస విడిచారు.
Current Affairs 1936, ఏప్రిల్ 1న జోర్హాట్ జిల్లాలో జన్మించిన తరుణ్ గొగోయ్... కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ప్రజాధరణ నేతగా ఎదిగారు. 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఆ తరువాత వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. పీవీ నరసింహారావు కేబినేట్‌లో కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత 2001, 2006, 2011లలో వరుసగా మూడుసార్లు అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పారు.

గాంధీజీ మునిమనవడు మృతి
దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో ఉంటున్న భారత జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్ ధుపేలియా(66) కోవిడ్-19 సోకి కన్నుమూశారు. కరోనాతోపాటు న్యూమోనియాతో సతమతమవుతున్న ఆయన నవంబర్ 22న గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గాంధీజీ కుమారుడు మణిలాల్ గాంధీ కుటుంబానికి చెందిన సతీశ్ ధుపేలియా డర్బన్‌లో గాంధీజీ స్థాపించిన ఫోనిక్స్ ఆశ్రమ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఫొటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్‌గా మీడియా రంగంలో ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : తరుణ్ గొగోయ్(84)
ఎక్కడ : గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసీహెచ్), గువాహటి, అస్సాం
ఎందుకు : కోవిడ్-19 అనంతర అనారోగ్య సమస్యలతో
Published date : 24 Nov 2020 06:38PM

Photo Stories