అస్కా సలోమీకి నైటింగేల్ నర్సెస్ పురస్కారం
Sakshi Education
ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వృత్తిలో విశేష సేవలందించినందుకు అస్కా సలోమీకి అత్యున్నత పురస్కారం లభించింది.
నర్సింగ్ వృత్తిలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారంగా భావించే ‘జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డు-2019’ ఆమెను వరించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ఈమె పేరును కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ ఆమోదించింది. ఈ మేరకు జూన్ 27న దేశవ్యాప్తంగా పురస్కార గ్రహీతల జాబితాను విడుదల చేసింది. అస్కా సలోమీ 2009లో గాంధీ నర్సింగ్ కళాశాల నుంచి ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డు-2019
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : అస్కా సలోమీ
ఎందుకు : ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వృత్తిలో విశేష సేవలందించినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డు-2019
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : అస్కా సలోమీ
ఎందుకు : ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వృత్తిలో విశేష సేవలందించినందుకు
Published date : 28 Jun 2019 06:18PM