ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో దివ్యా రెడ్డికి స్వర్ణం
Sakshi Education
21వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా అథ్లెట్ దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించింది.
మలేసియాలోని సారావక్ రాష్ట్రం కుచింగ్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌లో దివ్యా రెడ్డి 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా-2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్-2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 21వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : దివ్యా రెడ్డి
ఎక్కడ : కుచింగ్, సారావక్ రాష్ట్రం, మలేసియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : 21వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : దివ్యా రెడ్డి
ఎక్కడ : కుచింగ్, సారావక్ రాష్ట్రం, మలేసియా
Published date : 04 Dec 2019 05:36PM