ఆసియా చెస్ బ్లిట్జ్ చాంపియన్‌గా నిహాల్
Sakshi Education
జింగ్‌తాయ్ (చైనా): భారత యువ గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో టైటిల్ సాధించాడు.
జూన్ 15న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో నిహాల్ ఎనిమిది పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 14 ఏళ్ల నిహాల్ ఏడు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. భారత్‌కే చెందిన ఎస్.ఎల్.నారాయణన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకోగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు క్లాసిక్ విభాగం ఓపెన్ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్స్ కార్తికేయ మురళి, సేతురామన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. కార్తికేయ, సేతురామన్‌తోపాటు నారాయణన్ కూడా వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆసియా చెస్ బ్లిట్జ్ చాంపియన్‌గా నిహాల్
ఎప్పుడు: జూన్ 15
ఎవరు: నిహాల్ సరీన్
ఎక్కడ: జింగ్‌తాయ్ (చైనా)
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆసియా చెస్ బ్లిట్జ్ చాంపియన్‌గా నిహాల్
ఎప్పుడు: జూన్ 15
ఎవరు: నిహాల్ సరీన్
ఎక్కడ: జింగ్‌తాయ్ (చైనా)
Published date : 17 Jun 2019 06:13PM