ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదికను ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారు?
Sakshi Education
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో 2021, మే 21 నుంచి 31 వరకు జరగాల్సిన ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక మారిపోయింది.
ఈ మెగా ఈవెంట్ భారత్‌లో కాకుండా యూఏఈలోని దుబాయ్‌లో మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనుంది. భారత్ లో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ ఏప్రిల్ 28న తెలిపారు.కరోనా సెకండ్ వేవ్ కారణంగానే న్యూఢిల్లీలో మే 11 నుంచి 16 వరకు జరగాల్సిన ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక మార్పు
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)
ఎక్కడ : న్యూఢిల్లీ నుంచి దుబాయ్ కు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక మార్పు
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)
ఎక్కడ : న్యూఢిల్లీ నుంచి దుబాయ్ కు
ఎందుకు :భారత్ లో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా..
Published date : 29 Apr 2021 06:05PM