ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఎనిమిది స్వర్ణాలు
Sakshi Education
మూడవ ఎడిషన్ ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ 8 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది.
చైనా 12 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 31 పతకాలు గెలిచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. హాంకాంగ్‌లో మార్చి 15 నుంచి 17 వరకు జరిగిన ఈ చాంపియన్ షిప్‌లో బాలుర 10 వేల మీటర్ల నడక విభాగంలో విశ్వేంద్ర సింగ్, డెకాథ్లాన్ లో ఉసైద్ ఖాన్ లో స్వర్ణ పతకాలు సాధించారు. అలాగే బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో థబిత ఫిలిప్ మహేశ్వర, బాలుర హ్యామర్‌త్రోలో విపిన్ కుమార్, బాలికల లాంగ్‌జంప్‌లో థబిత ఫిలిప్ మహేశ్వరన్ , బాలుర 400 మీటర్ల రేసులో అబ్దుల్ రజాక్, బాలికల 100 మీటర్ల విభాగంలో అవంతిక నరాలే, మెడ్లే రిలేలో నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా యూత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు 8 స్వర్ణాలు
ఎప్పుడు : మార్చి 17
ఎక్కడ : హాంకాంగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా యూత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు 8 స్వర్ణాలు
ఎప్పుడు : మార్చి 17
ఎక్కడ : హాంకాంగ్
Published date : 18 Mar 2019 06:00PM