ఆరు డెట్ స్కీమ్‌లను మూసివేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
Sakshi Education
కరోనా వైరస్ మహమ్మారి.. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి.
మూతబడిన స్కీమ్‌లు ఇవే...
తాజాగా దీని ధాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్ హౌస్ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం. ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏప్రిల్ 24న తెలిపింది.
మూతబడిన స్కీమ్‌లు ఇవే...
- ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్
- ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ ఎక్రువల్ ఫండ్
- ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్
- ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్‌కం ప్లాన్
- ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్
- ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కం ఆపర్చూనిటీస్ ఫండ్
Published date : 25 Apr 2020 06:50PM