Skip to main content

ఆర్థిక మంత్రి ప్రారంభించిన పీఎస్‌బీ అలయెన్స్ కార్యక్రమం ఉద్దేశం?

ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) ఖాతాదారులకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందించే ‘పీఎస్‌బీ అలయెన్స్-ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలు’ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 9న ప్రారంభించారు.
Current Affairs

2018లో ఆర్థిక సేవల విభాగం ప్రవేశపెట్టిన ఈజ్ సంస్కరణలో భాగంగా ఈ సేవలను అందబాటులోకి తెచ్చారు. వినియోగదారులకు, సులభంగా, సౌకర్యవంతంగా సేవలను అందించడమే పీఎస్‌బీ అలయెన్స్ కార్యక్రమ ఉద్దేశమని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 100 కేంద్రాల వద్ద ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

పీఎంస్వనిధి లబ్ధిదారులతో మోదీ...
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి(పీఎంస్వనిధి) లబ్ధిదారులను ఉద్దేశించి సెప్టెంబర్ 9న ఆన్‌లైన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వినియోగదారుల నుంచి నగదు తీసుకోకుండా, డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రోత్సహించాలని వారికి సూచించారు. వీధుల్లో తోపుడు బండ్లపై, ఇతర మార్గాల్లో చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మే చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం పెద్ద రెస్టారెంట్ల తరహాలో ఒక ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే యత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన పథకం ఒకటి రూపకల్పన దశలో ఉందన్నారు.

చదవండి: పీఎం స్వనిధి పథకాన్ని ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారు?

క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎస్‌బీ అలయెన్స్-ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలుకార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్
ఎందుకు : ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) ఖాతాదారులకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు అందించేందుకు

Published date : 10 Sep 2020 05:15PM

Photo Stories