Skip to main content

ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు ఆమోదం

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2019ను పార్లమెంటు ఆగస్టు 6న ఆమోదించింది.
తీర్మానం, బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 6న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదంపై ఓటింగ్ నిర్వహించగా, అనుకూలంగా 351 ఓట్లు, వ్యతిరేకంగా 72 ఓట్లు పడ్డాయి. ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ తీర్మానం, బిల్లును ఆగ స్టు 5న రాజ్యస‌భ ఆమోదించింది.

జమ్మూకశ్మీర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లును మాత్రం లోక్‌సభ నుంచి అమిత్ షా వెనక్కు తీసుకుంటూ, ఈ రిజర్వేషన్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటంతట అవే అమలవుతాయని అన్నారు. రాజ్యసభ నుంచి కూడా బిల్లును వెనక్కు తీసుకుంటామన్నారు. తీర్మానం, బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
Published date : 07 Aug 2019 05:21PM

Photo Stories