ఆర్మీలో కెప్టెన్ హోదా పొందిన మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడు?
Sakshi Education
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్(46) ప్రాదేశిక సైన్యం(టెరిటోరియల్ ఆర్మీ)లో కెప్టెన్ అయ్యారు.
దీంతో ఈ హోదా పొందిన మొట్టమొదటి పార్లమెంట్ సభ్యునిగా ఆయన రికార్డు సృష్టించారు. 124 సిఖ్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా అనురాగ్ పదోన్నతి పొందారు. 2016 జూలైలో ఆయన ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్‌గా మొదటి బాధ్యతలు చేపట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అనురాగ్ హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు.
అత్యవసర సమయాల్లో దేశానికి సేవలందించేందుకు... స్వచ్ఛందంగా చేరే వారితో ఏర్పాటు చేసిన టెరిటోరియల్ ఆర్మీని ప్రభుత్వం సిద్ధంగా ఉంచుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్మీలో కెప్టెన్ హోదా పొందిన మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడు?
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్అత్యవసర సమయాల్లో దేశానికి సేవలందించేందుకు... స్వచ్ఛందంగా చేరే వారితో ఏర్పాటు చేసిన టెరిటోరియల్ ఆర్మీని ప్రభుత్వం సిద్ధంగా ఉంచుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్మీలో కెప్టెన్ హోదా పొందిన మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడు?
ఎప్పుడు : మార్చి 10
Published date : 11 Mar 2021 05:35PM