ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు: సుప్రీంకోర్టు
Sakshi Education
ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల కూల్చొద్దని, కూల్చివేతపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆరే కాలనీలో ఇప్పటి వరకు జరిగిన చెట్ల కూల్చివేత, ప్రాజెక్టు పనులపై నివేదిక ఇవ్వాలని, నరికివేతకు గురైన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ను అక్టోబర్ 21న ఆదేశించింది. ముంబైలో పచ్చదనానికి నెలవైన ఆరే కాలనీలో మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం పెద్ద సంఖ్యలో చెట్లను నేలకూల్చడంపై న్యాయ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : ఆరే కాలనీ, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : సుప్రీంకోర్టు
ఎక్కడ : ఆరే కాలనీ, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం
Published date : 22 Oct 2019 05:22PM