ఆర్చరీ ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు స్వర్ణం
Sakshi Education
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్‌లో భారత మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది.
గ్వాటెమాలాలో ఏప్రిల్ 25న జరిగిన ఫైనల్లో దీపిక కుమారి, అంకిత భకత్, కోమలిక బారిలతో కూడిన భారత టీమ్ 5–4 (57–56, 55–57, 55–57, 57–52, 27–26)తో రోమన్, అలెజాండ్రా వేలన్సియా, అనా వాస్క్వెజ్‌లతో కూడిన మెక్సికో మహిళల జట్టుపై గెలుపొందింది. మిక్స్‌డ్ రికర్వ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో అంకిత భకత్–అతాను దాస్ (భారత్) ద్వయం 6–2తో కేసీ కఫోల్డ్–బ్రాడీ ఎలిసన్ (అమెరికా) జంటపై నెగ్గింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్‌లో భారత్ కు స్వర్ణం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : దీపిక కుమారి, అంకిత భకత్, కోమలిక బారి
ఎక్కడ : గ్వాటెమాలా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్‌లో భారత్ కు స్వర్ణం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : దీపిక కుమారి, అంకిత భకత్, కోమలిక బారి
ఎక్కడ : గ్వాటెమాలా
Published date : 26 Apr 2021 07:52PM