Skip to main content

అఫ్గానిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులు

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలోనే రెండు చోట్ల ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు.
సెప్టెంబర్ 17న జరిగిన ఈ వరుస ఘటనల్లో 48 మంది మరణించగా, 80 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో మొదటి ఆత్మాహుతి దాడి ఆ దేశ అధ్యక్షుడి ఎన్నికల ప్రచారంలో కాగా, రెండోది కాబూల్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ఆ దేశ అధ్యక్షుడు అషఫ్ ్రఘని ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని తాలిబన్ హెచ్చరించింది.

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 10న తాలిబన్లతో చర్చలను అకస్మాత్తుగా ముగించిన విషయం తెలిసిందే.
Published date : 18 Sep 2019 06:25PM

Photo Stories