Skip to main content

ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్‌ను ప్రధాని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

బిహార్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ‘ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్’ కార్యక్రమంను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 21న వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
Edu news
అలాగే రాష్ట్రంలోని 9 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని పేర్కొన్నారు.

ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లుకు ఆమోదం
కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సెప్టెంబర్ 21న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిహార్
ఎందుకు : బిహార్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు
Published date : 22 Sep 2020 06:14PM

Photo Stories