అంతర్జాతీయ క్రికెట్‌కు ఫిలాండర్ వీడ్కోలు
Sakshi Education
దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ వెర్నన్ ఫిలాండర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
దక్షిణాఫ్రికాలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు ముగిసిన అనంతరం జనవరి 24న అతడు క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. ఫిలాండర్ దక్షిణాఫ్రికా తరఫున 64 టెస్టులు, 30 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 224 వికెట్లు, వన్డేల్లో 41, పొట్టిఫార్మాట్‌లో నాలుగు వికెట్లు తీశాడు. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌తో పాటు దక్షిణాఫ్రికా పేస్ విభాగంలో కీలక బౌలర్‌గా సేవలందించిన ఫిలాండర్.. తన తొలి ఏడు టెస్టుల్లోనే 51 వికెట్లు తీసి సత్తా చాటాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : వెర్నన్ ఫిలాండర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : వెర్నన్ ఫిలాండర్
Published date : 29 Jan 2020 06:06PM