ఆంధ్రప్రదేశ్‌కు రెండు ‘ఇండియాటుడే’ అవార్డులు
Sakshi Education
ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే ఏటా నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో 2019కి గాను ఆంధ్రప్రదేశ్ రెండు అవార్డులను గెలుచుకుంది.
వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతలు, ప్రభుత్వ పరిపాలన, వ్యాపార వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పెద్ద రాష్ట్రాల్లో సమ్మిళితవృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని ఎంపిక చేశారు. పెద్ద రాష్ట్రాల్లో వైద్యం, పర్యాటక రంగాల్లో అత్యున్నత పురోగతి సాధించినందుకు గాను రాష్ట్రం అవార్డును కైవసం చేసుకుంది. నవంబర్ 22న న్యూఢిల్లీలో జరిగే ‘ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్’ కాన్‌క్లేవ్-2019లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఇండియాటుడే అవార్డులు
ఎందుకు: వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతలు, ప్రభుత్వ పరిపాలన, వ్యాపార వాతావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని.
ఎక్కడ: న్యూఢిల్లీ

Published date : 16 Nov 2019 05:46PM