ఆంధ్రప్రదేశ్‌కు 27 వేల కోట్ల నాబార్డు రుణం
Sakshi Education
వివిధ రంగాల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.27,992 కోట్ల రుణం అందించినట్లు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు) వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.27,992 కోట్ల రుణం
ఎప్పుడు : 2019-20 ఆర్థిక సంవత్సరం
ఎవరు : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు)
2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 41 శాతం అధికంగా రుణం విడుదల చేసినట్లు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) ఎస్.సెల్వరాజ్ ఏప్రిల్ 2న తెలిపారు.చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో తాగు, సాగునీటికి రూ.1,931 కోట్లు, ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థకు రూ.4,030 కోట్లను రుణంగా విడుదల చేశామన్నారు. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలుగా వివిధ బ్యాంకులకు రీఫైనాన్స్ రూపంలో రూ.20,515 కోట్ల మొత్తాన్ని అందించామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.27,992 కోట్ల రుణం
ఎప్పుడు : 2019-20 ఆర్థిక సంవత్సరం
ఎవరు : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు)
Published date : 03 Apr 2020 06:38PM