ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సెక్రటరీ, రవాణా శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామాంజనేయులు ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్నారు. కాగా, ఇప్పటివరకు ఏసీబీ డీజీగా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా నియామకం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : పి.సీతారామాంజనేయులు
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా నియామకం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : పి.సీతారామాంజనేయులు
మాదిరి ప్రశ్నలు
1. ఆంధ్రప్రదేశ్ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా 2019, సెప్టెంబర్ 14న బాధ్యతలు చేపట్టిన హెకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎవరు?
1. జస్టిస్ అశోక్ భూషణ్
2. జస్టిస్ బి. శివశంకరరావు
3. జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్
4. జస్టిస్ జేకే మహేశ్వరి
- View Answer
- సమాధానం : 2
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్‌పర్సన్‌గా అక్టోబర్ 30 ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎవరు?
1. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి
2. జస్టిస్ శంకరనారయణ
3. జస్టిస్ ఇంద్రజిత్
4. జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి
- View Answer
- సమాధానం : 4
Published date : 06 Jan 2020 05:55PM