ఆలయాల శుభ్రతకు దేశంలోని ప్రధాన దేవాలయాలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
Sakshi Education
పరిశుభ్రత ఉత్పత్తులను తయారు చేసే నేచర్ ప్రొటెక్ట్ సంస్థ దేశంలో ప్రధాన దేవాలయాలతో భాగస్వామ్య ఒప్పందాన్ని ఏర్పరుచుకుంది.
పండుగల వేళలో దేవాలయాల ప్రాంగణాలను శుభ్రంగా ఉంచటంతో పాటు భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు కంపెనీ ప్రత్యేకమైన చర్యలను చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం, కర్నాటకలోని శ్రీ చాముండేశ్వరీ దేవాలయం, కేరళలోని గురువయార్ దేవాలయం, తమిళనాడులోని మీనాక్షీ అమ్మన్ దేవాలయాలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆలయాల శుభ్రతకు దేశంలోని ప్రధాన దేవాలయాలతో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : నేచర్ ప్రొటెక్ట్ సంస్థ
Published date : 15 Jan 2021 03:48PM