అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు పెట్టుబడి సహాయం కోసం ఉద్దేశించిన ‘వెఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని 2019, అక్టోబర్ 15 నుంచి అమలుచేయన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జూన్ 6న నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 13,125 కోట్లు రైతులకు ప్రభుత్వం అందించనుంది.
ముఖ్యమంత్రి మరికొన్ని నిర్ణయాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు
ముఖ్యమంత్రి మరికొన్ని నిర్ణయాలు...
- కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా సాయం, 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డు
- ప్రభుత్వమే రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లింపు, వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏర్పాటు
- రూ. 3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు
- విపత్తులు ఎదుర్కోవడానికి రూ. 4 వేల కోట్లతో నిధి
- రేషన్ బియ్యంతో పాటుమరో 6 రకాల వస్తువులు పంపిణీ
- వ్యవసాయం దశ, దిశ నిర్దేశానికి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక శీతల గిడ్డంగి, ఒక వేర్ హౌస్, అవసరం మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు
- రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాల్లోనే సమగ్ర బిల్లు తీసుకువచ్చి విత్తన చట్టం రూపకల్పన
- రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందేలా చర్యలు
- వ్యవసాయ సంక్షోభంలో చిక్కి ఎవరైనా రైతు కన్నుమూస్తే రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లింపు
- సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయల బోనస్చెల్లింపు.
- అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలు వ్యవసాయరంగ అవసరాలకు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి.
- చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకంరద్దు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు
Published date : 07 Jun 2019 05:36PM