Skip to main content

అక్షయపాత్రకు గ్లోబల్ చాంపియన్ అవార్డు

బెంగళూరుకు చెందిన అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు బీబీసీ వరల్డ్ సర్వీస్ ‘గ్లోబల్ చాంపియన్’ అవార్డు లభించింది.
ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో జూన్ 14న జరిగిన కార్యక్రమంలో బీబీసీ వరల్డ్ సర్వీస్ విభాగం ఈ అవార్డును అక్షయపాత్రకు ప్రదానం చేసింది. భారత్‌లోని వేలాది పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తున్నందుకు గాను అక్షయపాత్రకు ఈ అవార్డు దక్కింది. 20ఏళ్ల క్రితం ప్రారంభమైన అక్షయపాత్ర సంస్థ, నేడు దేశవ్యాప్తంగా పదిలక్షలమందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలను అందిస్తుంది. ప్రసుత్తం అక్షయపాత్ర సీఈవోగా శ్రీధర్ వెంకట్ ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బీబీసీ వరల్డ్ సర్వీస్ ‘గ్లోబల్ చాంపియన్’ అవార్డు
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : అక్షయపాత్ర
ఎందుకు : పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తున్నందుకు గాను
Published date : 15 Jun 2019 06:23PM

Photo Stories