ఆక్స్‌ఫర్డ్ టీకాకు ఆమోదం తెలిపిన తొలి దేశం?
Sakshi Education
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆ్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్ టీకా ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి డిసెంబర్ 30న బ్రిటన్ అనుమతిచ్చింది.
దీంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెలిపిన తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. 2021, జనవరి 4 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’ వ్యాక్సిన్‌నుపజలకు ఇవ్వడం ప్రారంభించింది.
కొత్త తరహా కోవిడ్...
యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త తరహా కోవిడ్ వైరస్ ‘వీయూఐ 20212/01’ను భారత్‌లో మొత్తం 20 మందిలో గుర్తించారు. మొత్తం 107 శాంపిల్స్ పరీక్షించగా 20 మందిలో కొత్త తరహా వైరస్ బయటపడింది.
మొత్తం కేసులు...
భారత్‌లో డిసెంబర్ 30నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,44,852కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం... మొత్తం మరణాల సంఖ్య 1,48,439కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 98,34,141కు చేరుకుంది. మొత్తం రికవరీ రేటు 95.99 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,62,272గా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్, ఆ్ట్రాజెనెకా టీకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన తొలి దేశం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : బ్రిటన్
ఎందుకు : కోవిడ్-19ను నిరోధించడానికి

Published date : 31 Dec 2020 06:02PM