Skip to main content

ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి భారతీయురాలు?

భారత్‌కు చెందిన రష్మీ సామంత్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించారు.
Current Affairs
దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. లినారె కాలేజ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న రష్మీ మొత్తం 3,708 ఓట్లకుగానూ, 1,966 ఓట్లు సాధించారు. 2021-22 సంవత్సరానికి ఆమె విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పని చేయనున్నారు. బేమ్ (బ్లాక్, ఏసియన్, మైనారిటీ, ఎత్నిక్) వర్గానికి చెందిన రష్మీ సామంత్ బలహీన వర్గాలకు చెందిన వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లుగా విజన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలిగా దేవికా అనే మరో బారతీయురాలు ఎన్నికయ్యారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారత మహిళ
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : రష్మీ సామంత్
ఎక్కడ : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్
Published date : 15 Feb 2021 05:56PM

Photo Stories