Skip to main content

ఆకలి సూచీలో భారత్‌కు 102వ స్థానం

2019 ప్రపంచ ఆకలి సూచీ(గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారత్ 102వ స్థానానికి దిగజారింది.
ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మన్ సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా తయారుచేసిన ఈ సూచీ భారత్‌లో ఆకలి తీవ్రమైందని హెచ్చరించింది. మొత్తం 117 దేశాలను పరిగణలోనికి తీసుకుని రూపొందించిన ఈ సూచీలో ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్‌లు అగ్రస్థానాల్లో ఉన్నాయి.

నాలుగు అంశాల ఆధారంగా రేటింగ్...
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కేటగిరీలో మన దేశం 30.3 స్కోరుతో ఉంది. ఈ స్కోరుని నాలుగు సూచీలపై ఆధారపడి నిర్ణయిస్తారు. పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉండడం, వయసుకి తగ్గ ఎత్తు ఎదగకపోవడం, శిశు మరణాలు.

ప్రపంచ ఆకలి సూచీ-ముఖ్యాంశాలు
  • భారత్‌లోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు ఎత్తుకు తగ్గ బరువు లేరని, ఇతర దేశాలకంటే అతి తక్కువ బరువుతో ఉన్నారు.
  • 2008-12 మధ్య బరువు తక్కువ ఉన్న పిల్లల శాతం దేశంలో 16.5 శాతం ఉండగా, 2014-18కి మధ్య 20.8 శాతానికి దిగజారింది.
  • 2000 సంవత్సరంలో మొత్తం 113 దేశాల్లో భారత్ 83 స్థానంలో ఉండగా, 2018లో మొత్తం 119 దేశాల జాబితాలో 103 స్థానంలో ఉంది.
  • దేశంలో కేవలం 6 నుంచి 23 నెలల మధ్య వయసున్న వారిలో 9.6 శాతం మందికి మాత్రమే ‘కనీస ఆహార అవసరాలు’తీరుతున్నాయి.
  • భారత్‌లో కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇంకా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన జరుగుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందనీ, దానివల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు తలెత్తుతున్నాయంది.
  • బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ సహా మొత్తం 17 దేశాలు ఈ సూచీలో 5 కన్నా తక్కువ ర్యాంకుతో ఉన్నత స్థానంలో ఉన్నాయి.
  • నిత్యం ఘర్షణ వాతావరణం ఉండే, తీవ్రమైన వాతావరణ మార్పులతో సతమతమౌతోన్న యెమన్, జిబౌటి దేశాలు సైతం భారత్ కన్నా మెరుగ్గా ఉన్నాయి.
  • పొరుగు దేశాలైన నేపాల్(73), శ్రీలంక(66), బంగ్లాదేశ్(88), మయన్మార్(69), పాకిస్తాన్ (94) స్థానంలో ఉండి ఆకలి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి.
  • చివరకు చైనా (25) సైతం భారత్ కన్నా మెరుగైన స్థానంలో ఉంది.

ప్రపంచ ఆకలి సూచీ 2019

ర్యాంకు

దేశం

స్కోరు

117

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

53.6

116

యెమెన్

45.9

115

చాద్

44.2

114

మడగాస్కర్

41.5

113

జాంబియా

38.1

112

లైబీరియా

34.9

111

హైతీ

34.7

110

తిమోర్-లిస్తే

34.5

109

జింబాబ్వే

34.4

108

అఫ్గానిస్తాన్

33.8

102

భారత్

30.3

94

పాకిస్తాన్

28.5

88

బంగ్లాదేశ్

25.8

73

నేపాల్

20.8

66

శ్రీలంక

17.1

Published date : 17 Oct 2019 05:53PM

Photo Stories